6 నెలల తరువాత తల్లిపాల ఆవశ్యకత

6 నెలల తరువాత తల్లిపాల ఆవశ్యకత

 

ఈ వ్యాసం ప్రస్తుతం IAP నిపుణుల సమీక్షలో ఉంది; ఇంకా సవరించలేదు మరియు ఆమోదించలేదు మరియు సాంకేతిక మరియు భాషా లోపాలను కలిగి ఉండవచ్చు. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సరిదిద్దబడిన మరియు ఆమోదించబడిన ఆంగ్ల సంస్కరణను దయచేసి చదవండి.

పుట్టిన పిల్లలకు  మొదటి ఆరు నెలలు తల్లి పాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. తల్లి పాలు బిడ్డ ఎదుగుదలకు మరియు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి. ఇందులో ఎక్కువ మోతాదులో విటమిన్లు, యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు), ఉండటం వలన ఇవి బిడ్డ యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందించుటలో సహాయపడతాయి. కానీ 6 నెలల తరువాత తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం మానడం వలన ఎన్నో లాభాలను తల్లీ, బిడ్డ పొందలేకపోతున్నారు.

ఐతే సాధారణంగా మొదటి 6 నెలలు తల్లిపాలు ఇవ్వమని సూచనలిస్తారు. కానీ 6 నెలల తరువాత తల్లిపాలు కొనసాగించడం వలన బిడ్డకు, తల్లికి ఎంతో మేలు జరుగుతుంది.

బిడ్డ మానసికంగా ఎదగడానికి ఎన్నో విటమిన్లు, పోషకపదార్థాలు కావాల్సి ఉంటుంది. అందువలన ఘన పోషకాలతో పాటు తల్లి పాలను కొనసాగించడం చాలా మంచిది.

బిడ్డకు ఘనపు ఆహారా పదార్థాలు సరిపోతాయా?

బిడ్డకు 6 నెలల వయస్సు ఉన్నప్పుడు ఘనపు ఆహార పదార్థాలని ఇవ్వడం మొదలు పెట్టాలి. ఎందుకంటే పోషకాల అవసరం తల్లిపాలకంటే ఎక్కువ అవసరమౌతాయి.

అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పిడియాట్రీషన్‌ (ఏఏపీ) ప్రకారం బిడ్డకు 6 నెలలు తల్లిపాలు ఇవ్వడం మరియు 6వ నెల ప్రారంభం నుంచే ఘనపు ఆహార పదార్థాలను ఇవ్వడం మొదలుపెట్టాలి. ఘనపు ఆహారం అదనంగా పోషకాలను సరఫరా చేయడంలో తల్లిపాలతో పాటు సహాయపడుతుంది.

ఏఏపీ ప్రకారం బిడ్డకు తల్లిపాలను ఇవ్వడం లేదా కొనసాగించడం వలన ఘనపు ఆహార పదార్థాలలో లేని ఎన్నో పోషకాలను సరఫరా చేస్తుంది. బిడ్డ 12 నెలలు లేదా ఎక్కువ తల్లిపాలను ఇవ్వమని ఏఏపీ సూచనలిస్తుంది.

తల్లిపాల యొక్క ప్రముఖ్యత 6 నెలల తరువాత చాలా అవసరం. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌ వో) మరియు యునిసెఫ్‌ (యుఎన్‌ఐసిఈఎఫ్‌) తల్లిపాలను కొనసాగించడం కోసం అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాయి.

ఈ సంస్థలు ప్రత్యేకంగా తల్లిపాలను 6 నెలలు ఇవ్వమని చెప్పినా తరువాత కూడా తల్లిపాలను కొనసాగించమని సూచనలిస్తాయి. ఐతే డబ్ల్యూ హెచ్‌ వో కనీసం ఒక సంవత్సరం యునిసెఫ్‌ కనీసం 2 సంవత్సరాలు తల్లిపాలను ఇవ్వమని సూచనలిస్తాయి. ఎంత ఎక్కువ కాలం తల్లిపాలను ఇస్తే తల్లికి, బిడ్డకీ ఎంతో మేలు కలుగుతుంది.

తల్లిపాలు 6 మాసాల తరువాత బిడ్డకు ఎలా సహాయపడుతాయి?

నరిష్‌మెంట్‌ (సంరక్షణ) : తల్లిపాలలో విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఆవశ్యకమైన పోషకాలు బిడ్డ శరీరాన్ని సంరక్షిస్తూ పెరుగుదలకు దోహదపడుతాయి. తల్లిపాలను తాగడం కోసం బిడ్డ (తల్లి యొక్క స్థనాలను చేరుకోవడం కోసం) తాపత్రయపడడంతో బిడ్డ యొక్క మెడ కండరాలు గట్టిపడతాయి.

మానసిక ఎదుగుదల: తల్లిపాలు బిడ్డ యొక్క శరీరానికి రక్షణను కల్పించడం మాత్రమే కాక బిడ్డ యొక్క మానసిక వికాసంలో సహాయపడతాయి. ” బిడ్డ ఎదుగులపై తల్లిపాల ప్రభావం”అనే అంశంపై పిజె.క్విన్‌ మరియు అతని బృందం ఐదు సంవత్సరాలపై జరిపిన అధ్యయనంలో హ్యూమన్‌ మిల్క్‌లో డిహెచ్‌ఏ, మరియు బిడ్డ మానసిక ఎదుగుదలకు కావాల్సిన ఆవశ్యకమైన బయో యాక్టివ్‌ పదార్థాలు కలిగి ఉంటాయి. ఈ పదార్థాలు ఆవుపాలలో మరియు ఏ ఇతర ఫార్ములా పాలలో లభించవు.

రోగ నిరోధక వ్యవస్థ:

బిడ్డ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

జలుబు, అలర్జీలు, చెవి సంబంధ రోగాలు, వాయు సంబంధ రోగాలు ఇలాంటివి రాకుండా చేసే చిట్కా ఏమంటే తల్లి పాలను బిడ్డ ఇవ్వడం.

తల్లిపాలు యాంటీబయోటిక్స్‌ (ప్రతిరక్షకాలు) ను కలిగి ఉంటాయి. ఇవి అనారోగ్యానికి గురయ్యే కాలాన్ని తగ్గించి త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఒకవేళ బిడ్డ అనారోగ్యంగా ఉంటే తల్లిపాలను బిడ్డ త్రాగుతూ ఉంటే వ్యాధులు త్వరగా నయమౌతాయి. ఇంకా తల్లిపాలు పసిపిల్లల రక్షణకే కాక బిడ్డ ఎదిగిన తరువాత తర్వాతి దశలలో కొన్ని వ్యాధులు రాకుండా నివారిస్తుంది. ఉదా: మధుమేహం, ఊబకాయం, ఆయాసం.

జీర్ణశక్తిని పెంచుతుంది:

తల్లిపాలు బిడ్డ యొక్క జీర్ణ శక్తిని పెంచుతాయి. అందుకే బిడ్డకు ఘనపు ఆహార పదార్థం మొదలు పెట్టాక తల్లి పాలను ఇవ్వడం మానకూడదు. తల్లిపాలు ఘనపు ఆహారం జీర్ణమవ్వడంలో మరియు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతాయి. తల్లిపాలు పోషణ కోసం మాత్రమే కాకుండా ఆహారం జీర్ణమవ్వడం కోసం బిడ్డకు ఇవ్వడం మంచిది.

తల్లిపాలు ఇవ్వడం దంత నిర్మాణంలో వచ్చే నొప్పిని నివారిస్తుంది:

దంతాలు రావడం అనేది స్వీయ ప్రక్రియ. ఈ సమయంలో శిశువు ఘనపు ఆహారం స్వీకరించడం నిలిపివేయచ్చు. కానీ తల్లిపాలను కొనసాగించినట్లైతే శిశువు దంత నిర్మాణంలో కలిగే నొప్పిని నివారిస్తుంది.

6 నెలల తరువాత తల్లిపాల ఆవశ్యకత:

బంధం: తల్లి తన రొమ్ము పాలను బిడ్డకు అందించేటప్పుడు ప్రత్యేకమైన అనుభూతి చెందుతుంది. ఈ భావన పరస్పరం తల్లికీ, బిడ్డకి ఇద్దరికీ ఉంటుంది. తల్లి రెండు సంవత్సరాలు రొమ్ము పాలు ఇచ్చినా ఆ బంధం అలాగే కొనసాగుతుంది. ఇదొక సహజ ప్రక్రియ. బిడ్డకు సహజ రక్షణను తల్లి కలిగిస్తుంది.

క్యాన్సర్‌ ప్రమాదాన్ని నివారిస్తుంది: తల్లిగా మాతృత్వ సమయంలో వచ్చే క్యాన్సర్‌ (మెటర్నల్‌ క్యాన్సర్‌) గురించి ఆందోళన చెందుతుంది. కానీ రొమ్ము పాలను ఇవ్వటం వలన అండాశయ క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాలను నివారిస్తుంది. అందువలన తల్లి పాలివ్వడం బిడ్డకు, తల్లికి ఇరువురికి శ్రేయస్కరం.

ప్రసవం తర్వాత వచ్చే ఆందోళనను నివారిస్తుంది: కొన్ని అధ్యయనాల ప్రకారం బిడ్డను ప్రసవించిన తరువాత తల్లి మానసిక ఆందోళనకు గురి అవుతుంది. దీని వలన ఇది కోమార్బిడ్‌ అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిసార్డర్‌ (సివోసిడి)కి దారి తీస్తుంది. 6నెలల తరువాత కూడా బిడ్డకు తల్లి పాలిస్తుంటే ప్రసవ ఆందోళనకు తక్కువగా ప్రభావితం అవుతుంది.

తల్లిపాలు అమూల్యమైనవి: తల్లిపాలు ఫార్ములా పాల ఉత్పత్తుల కన్నా చాలా అమూల్యమైనవి. సహజంగా తల్లి ద్వారా లభ్యమవుతాయి. ఫార్ములా పాలతో పోలిస్తే తల్లిపాలు బిడ్డకు అలర్జీలను కలుగజేయవు.

6నెలల తరువాత కలిగే అవరోధాలు : తల్లిపాలు 6నెలల కంటే ఎక్కువగా ఇవ్వడం తల్లికి, బిడ్డకు ఇరువురికీ శ్రేయస్కరం. కానీ కొన్ని కారణాల వలన తల్లి పాలివ్వకూడదనే నిర్ణయాలను తీసుకొంటుంది. ఆ కారణాలు ఏవంటే

  1. జనావాసంలో రొమ్ము పాలను ఇవ్వడం : తల్లిపాలను కొనసాగించడం వలన తల్లి తీసుకునే ప్రసూతి సెలవులు ముగుస్తాయి. తల్లి కొన్ని సమయాలలో జనసమూహంలో బిడ్డకు పాలిను ఇవ్వవలసి వస్తుంది.

భయంగా ఉండడం : జనసమూహంలో ఉన్నప్పుడు ఎక్కువమంది గమనించడం, ఇతరులు ఇబ్బందిగా చూడడం వలన సిగ్గుతో తల్లి ఫార్ములా పాలను ఇవ్వడానికి మక్కువ చూపుతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. చాలా రెస్టారెంట్లు, బస్టాండులు, జనసమూహాలలో తల్లిపాలను ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులను ఉపయోగించవచ్చు. లేదా ఏదైనా ప్రదేశంలో కొంగు, శాలువా, దుప్పటి లను ఉపయోగించి తల్లి పాలను ఇవ్వడం వలన ఇతరుల దృష్టి నుంచి తప్పించుకోవచ్చు.

  1. కొరకడం, గాయాలు : బిడ్డకు దంతాలు వచ్చిన తరువాత తల్లి పాలు ఇచ్చే సమయంలో తల్లి రొమ్ముపై చిన్న చిన్న గాయాలు ఏర్పడతాయి. ఇవేమీ చాలా ప్రమాదకరమైన గాయాలేమీ కావు. కానీ బిడ్డ కొరకడం జరిగినట్లైతే బిడ్డకు సరిపడిన పాలు అందాయి లేదా సరైన భంగిమలో లేనప్పుడు కొరికే అవకాశం ఎక్కువ. అందువలన భంగిమలో మార్పు చేయడం వలన ప్రయోజనం ఉంటుంది.
  2. తల్లి పాలపై అయిష్టత : 6 నెలల తరువాత బిడ్డకు తల్లిపాలపై అయిష్టత కొన్నిసార్లు సహజంగానే ఏర్పడుతుంది. కొన్నిసార్లు బిడ్డకు అయిష్టత వలన ఘనపు ఆహారం కోరుకుంటుందని తల్లి అపోహ చెందుతుంది. కానీ ఘనపు ఆహారం తీసుకునే సమయంలో కాకపోయినా బిడ్డ అయిష్టత చూపుతుంది. కారణం బిడ్డకు ఏదైనా అనారోగ్యం లేదా చెవి సంబంధమైన వ్యాధి, వత్తిడి వలన కలుగుతుంది. కొన్నిసార్లు దంతాలు వచ్చే సమయంలో కూడా రొమ్ముపాలను తాగడానికి అయిష్టత చూపుతుంది.

ఎప్పుడైతే తల్లిపాలపై బిడ్డ అయిష్టత చూపుతుందో అప్పుడు పాలిచ్చే సమయాన్ని మార్చడం వలన లేదా బాగా అలసిపోయినప్పుడు నిద్రపోయే ముందర, నిద్ర లేచిన వెంటనే లేదా ఆకలిగా ఉన్నప్పుడు ఇవ్వడం వలన అయిష్టతను దూరం చేయవచ్చు.

ముగింపు: తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు మరియు సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. తల్లిని కూడా ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది. సరైన సమయంలో ఘనపు ఆహారాన్ని ఇవ్వడం వలన తల్లి ఫార్ములా పాల ఉత్పత్తులపై చేసే ఖర్చుని పొదుపు చేయవచ్చు.