సమన్వయ పోషణ ఎప్పటి నుంచి ప్రారంభించాలి?

 

ఈ వ్యాసం ప్రస్తుతం IAP నిపుణుల సమీక్షలో ఉంది; ఇంకా సవరించలేదు మరియు ఆమోదించలేదు మరియు సాంకేతిక మరియు భాషా లోపాలను కలిగి ఉండవచ్చు. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సరిదిద్దబడిన మరియు ఆమోదించబడిన ఆంగ్ల సంస్కరణను దయచేసి చదవండి.

సహజంగా ఆరోగ్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా బిడ్డ యొక్క వయస్సు 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ నుండి సమన్వయ పోషణను (సంపూర్ణ పౌష్టికాహారం) ప్రారంభించాలి. అంతే కాకుండా ఇది కొన్ని సాంప్రదాయ మూలాలపై ఆధారపడి ఉంటుంది. సమన్వయ పోషణ అంటే 6 నుండి 18 – 24 నెలల వరకు ఇవ్వాలి. సమన్వయ పోషణ తల్లిపాలతో సమాంతరంగా ఇవ్వడం ఒక మంచి సూచన.

ఈ సమయంలో చాలామంది పిల్లలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్న సమస్య. ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం భారతదేశంలోని తల్లిదండ్రులు వారి బిడ్డలకు సరైన సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించేలా చేయడం.

గుర్తుంచుకోవలసిన విషయాలు:

దాదాపుగా అన్ని సందర్భాలలోనూ సమన్వయ పోషణను పసివయస్సు నుంచే (6నెలలు) ప్రారంభించాలి.

సమన్వయ పోషణ తప్పనిసరిగా

– సరిపడినంత (వయస్సుకు తగినంత మోతాదులో ఆహారం ఇవ్వడం

– తరచుగా

– తగిన సమయాలలో

– వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారం

సమన్వయ పౌష్టిక పదార్థాలను స్వతహాగా వంటింటిలో తయారు చేయడం వలన తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.శుబ్రమైన నీటిని, క్రిమిరహితమైన సీసాలను, పాత్రలను ఉపయోగించడం వలన ఆహార పదార్థాలను సూక్షజీవులనుండి కలుషితం కాకుండా రక్షించవచ్చు.

ఎంత మోతాదులో ఆహారం ఇవ్వాలి?

పుట్టిన బిడ్డ యొక్క జీర్ణ వ్యవస్థ సున్నితంగా ఉంటుందనే విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సరైన వయస్సులో సరిపడినంత ఆహారాన్ని చిన్న మోతాదులలో  ఇవ్వడం మొదలుపెట్టాలి. ఏదైతే ఆహారం త్వరగా బిడ్డకు జీర్ణమౌతుందో దానిని మసాలాలు, కారం లేకుండా తగు జాగ్రత్తలు పాటించి ఇవ్వాలి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం  6 నెలలు పై బడిన బిడ్డకు తల్లిపాలతో పాటుగా సరైన పౌష్టికాహారాన్ని ఇవ్వాలి. రోజుకు 2 నుండి 3 సార్లు 6 నుండి 8 నెలల వయస్సులో రోజుకు 3 నుండి 4 సార్లు, 9 నుంచి 11 నెలల మధ్య ఇవ్వాలి. 12 నెలల తరువాత సమన్వయ పౌష్టికాహారంలో రోజుకోసారి చిరుతిండి (బిస్కెట్‌, స్నాక్స్‌) ఇవ్వడం మొదలుపెట్టాలి.

ఏమి తినిపించాలి ( 6 నుండి 12 నెలల మధ్య) :

సమన్వయ పౌష్టికాహారం అనునది వైవిధ్యమైన ఆహారంపై ఆధారపడి కాకుండా తయారు చేసేటప్పుడు నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ఆహారాన్ని తీసుకునే శిశువుకు తగు జాగ్రత్తలు తీసుకుని ఓపికతో సంరక్షిస్తున్న వ్యక్తి బిడ్డ ఆకలిగా ఉన్నప్పుడు ఇచ్చే సున్నితమైన ఆధారాలను (బిడ్డ ఏడవడం) పసిగట్టి బిడ్డకు ఆహారం అందించేలా ఉండాలి.

మార్కెట్‌లో పలురకాల సహజసిద్ధమైన ఆహారం బిడ్డకు ఇవ్వాలి. (6 నుండి 12 నెలలు) ఇంటిలో చేసిన రాగిజావ, ఉడికించిన యాపిల్‌, మెత్తగా చేసిన అరటిపండు, ఉడికించిన క్యారెట్టులలో చాలా పోషకవిలువలు బిడ్డకు ఎదిగే క్రమంలో మంచి ఫలితాలను ఇస్తాయి. అప్పుడే తీసిన బత్తాయి పండ్ల రసానికి ఒక సీసా నీటిని కలిపి బిడ్డకివ్వడం, దానిమ్మ రసం లేదా కప్పు నీటిలో ఉడికించిన ఎండు ద్రాక్ష లేదా తులసి నీటిని బిడ్డ శరీరంలోని మలినాలను తొలగించడానికి ఉపయోగించవచ్చు.

కొంతమంది మెత్తగా ఉడికించిన బియ్యపు పిండి, పప్పుధాన్యాలను మధ్యాన్నం, రాత్రికి తయారు చేస్తారు. చిటికెడు ఉప్పు మరియు 2 చుక్కలు నెయ్యి ఆహారాన్ని చాలా రుచిగా చేయును. బిడ్డకు ఒకటికంటే ఎక్కువ వైవిధ్యమైన పోషకాహారాన్ని ఒకేరోజు ఇవ్వడం మంచిది కాదు.

సులువుగా మార్కెట్‌లో దొరికే ఫార్ములా పాలను (పోతపాలు) బిడ్డ యొక్క వివిధ దశలకు అనుగుణంగా తయారు చేయవచ్చు. ఉదాహరణకు నాన్‌-ప్రో, లాక్టోజెన్‌ సెరిలాక్‌ అనునవి ఫార్ములా ఆహారాలు. ఐనప్పటికీ కొంతమంది బిడ్డలు కొన్ని అలర్జీలను కలిగి ఉండటం వలన గుడ్డు మరియు మాంసాహారాన్ని 12 నెలల తరువాత ఇవ్వడం మంచిదని సూచనలిస్తారు.

ఏ ఆహారాన్ని ఇవ్వాలి (12 నుండి 24 నెలల వయస్సులో):

చాలామంది బిడ్డలకు వయస్సు పెరిగేకొద్ది కొన్ని దంతాలు రావడం, వాటి వలన కొరకడం, చప్పరించడం ఎక్కువగా ఇష్టపడతారు. చపాతీలను ఈ దశలో మంచి ఆహారంగా పరిగణించవచ్చు. చిన్నమోతాదులలో చపాతీని (కొంచెం తియ్యగా చేసిన చపాతీ), ఇడ్లీ, దోశ, బిస్కెట్‌లు, బాగా పండిన అరటిపండు, మెత్తగా చేసిన అన్నం, పప్పు, బొప్పాయిలను ఆహారంగా ఇవ్వాలి. బిడ్డ తీసుకునే మోతాదును బట్టి ఆహారాన్ని పెంచుతూ పోవాలి. తల్లిపాలను, పోతపాలను ఎప్పటికీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు చిరుతిండిగా డ్రైఫ్రూట్స్‌తో చేసిన గంజిని ఆహారంగా ఇస్తారు.

బిడ్డకు సరైన, శుబ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వడం అనేది మొదటినుంచే అలవాటు చేసుకోవాలి. పుష్కలంగా పోషకాలు కలిగిన దేశంలో నివసిస్తూ ఇంటిలో తయారు చేసిన సంపూర్ణ ఆహారాన్ని అందించడం, కర్మాగారాలలో తయారు చేయబడిన పౌష్టికాహారాన్ని తక్కువ మోతాదులలో వినియోగించాలి. సంపూర్ణ పౌష్టికాహారం బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందనేది జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం.