సాధారణం గా రొమ్ము పాల ఉత్పత్తిని పెంచడానికి తీసుకోవాల్సిన ఆహారం

సాధారణం గా రొమ్ము పాల ఉత్పత్తిని పెంచడానికి తీసుకోవాల్సిన ఆహారం

 

ఈ వ్యాసం ప్రస్తుతం IAP నిపుణుల సమీక్షలో ఉంది; ఇంకా సవరించలేదు మరియు ఆమోదించలేదు మరియు సాంకేతిక మరియు భాషా లోపాలను కలిగి ఉండవచ్చు. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సరిదిద్దబడిన మరియు ఆమోదించబడిన ఆంగ్ల సంస్కరణను దయచేసి చదవండి.

పరిచయం

రొమ్ము పాల ఉత్పత్తి పెరగడం వలన మీ బిడ్డకు పాలు అందడమే కాకుండా మీకు కూడా సంతోషాన్నిస్తుంది. చాలా వరకు తల్లి ఉత్పత్తి చేసే పలు బిడ్డకు సరిపోతాయి, కానీ కొన్ని సార్లు మీ శిశువుకు సరిపోకపోవచ్చు. మీ రొమ్ము పాలను పెంచుకోవడానికి మీరు మీ బిడ్డ పుట్టిన వెంటనే పాలు ఇవ్వాలి తరచుగా పాలు ఇస్తూ ఉండాలి. పాల ఉత్పత్తి లేనప్పుడు కొన్ని ఆహారాలు రొమ్ము పాలు పెంచేవి ఉన్నాయి అవి తీసుకోవడం వల్ల మీ పాల ఉత్పత్తి ని పెంచుకోవచ్చు.

రొమ్ము పాల ఉత్పత్తిని పెంచే ఆహారాలు

నీళ్లు మరియు ఇతర జ్యూస్ లు; రొమ్ము పాలిచ్చే తల్లి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం హైడ్రెటెడ్ గా ఉండటం. ఇది కేవలం రొమ్ము పాలను పెంచడానికి మాత్రమే ముఖ్యమైనది కాదు ఇది తల్లి ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది. వీలైనంత  ఎక్కువగా నీళ్లు త్రాగండి దీని వలన మీ రొమ్ము పాల సరఫరా పెరుగుతుంది, రొమ్ముపాలు ఇచ్చే ముందు ఒక గ్లాస్ మంచి నీళ్ళు త్రాగండి.

మెంతులు; మెంతులు ను మేథీ అని కూడా అంటారు ఇవి రొమ్ము పాల సరఫరా ను పెంచుతుంది. పాల సరఫరా మాత్రమే కాదు డెలివరీ తర్వాత తల్లి ఎదుర్కొనే మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది. మీరు మెంతులు కూరల్లో వాడుకోవచ్చు లేదా టీ లో తీసుకోవచ్చు లేదా నీటిలో 7 నుండి 8 గంటలు నానబెట్టి తర్వాత ఆ నీటిని త్రాగొచ్చు.

సొంపు గింజలు; సొంపు గింజలను సౌంఫ్ అని కూడా అంటారు ఇవి రొమ్ము పాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి పిల్లల అరుగుదలకు మరియు కడుపు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడతాయి. అది మాత్రమే కాదు  తల్లులలో మాలబాధకాని తగ్గించడం లో సహాయపడుతుంది మరియు బ్రేఆత్ ఫ్రెషన్ర్ లా కూడా ఉపయోగపడుతుంది. ఇది నేరుగా తినచ్చు మరియు కూరల్లో కలుపుకోవచ్చు మరియు డెసెర్ట్ లలో రుచి కోసం వాడుకోవచ్చు.

క్యారేట్; క్యారేట్ లను నేరుగా తినొచ్చు లేదంటే జ్యూస్ చేసుకుని త్రాగొచ్చు. క్యారేట్ జ్యూస్ ను బ్రేక్ ఫాస్ట్ తో లేదా భోజనం చేసేటప్పుడు త్రాగడం వలన రొమ్ము పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది పాల ఉత్పత్తిని పెంచే అంశాలను కలిగి ఉంటుంది. ఇది తల్లులలో గుండె జబ్బులు, గుండె నొప్పి, కాన్సర్ వంటివి రాకుండా ఉంచుతుంది.

జీలకర్ర; జీలకర్ర ని జీరా అని కూడా అంటారు. రొమ్ము పాలిచ్చే తల్లులలో పాల సరఫరా ని అభివృద్ధి చేయడమే కాకా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీనిని కూరల్లో లేదా స్నాక్స్ లో రుచి కోసం కలుపుకోవచ్చు.

వెల్లుల్లి; వెల్లుల్లి అనేది చాలా ముఖ్యమైనది మరియు అందరికి తెలిసినది ఇది పాల ఉత్పత్తి కోసం చాలా ఉపయోగపడుతుంసి. ఇది నుత్రిఎంట్ లు కలిగి ఉంటుంది ఇది పాల ఉత్పత్తి పెంచడానికి మరియు  రక రకాల అనారోగ్యాల నుండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది.మీరు దీనిని మీ రోజూవారి ఆహారం లో కలపొచ్చు లేదా వెల్లుల్లిని వేయించి అన్నం తో తినొచ్చు.

గుమ్మడి గింజలు; గుమ్మడి గింజలు లేదా కద్దు కా బీజ్ ఇది రొమ్ము పాలను ఉత్పత్తి చేయడానికి కావాల్సిన వితమిన్ల ను అందిస్తుంది. ఇది తల్లులలో ఆహారం జీర్ణమవడానికి సహాయపడుతుంది. దీనిని సలాడ్స్ లో వేసుకోవచ్చు లేదా రోస్ట్ చేసి స్నాక్స్ లో ఉపయోగించుకోవచ్చు.

గసగసాలు; గసగసాలు ఖస్ ఖస్ అని కూడా అంటార ఇవి రొమ్ము పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచుతుంది. జాగ్రత్త వహించండి వీటిని మీరు చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. దీనిని పాలతో తీసుకోవచ్చు లేదా నూనె లేకుండా వేయించి సలాడ్స్ లో వేసుకుకి తినొచ్చు.

పాలకూర; పాలకూర విటమిన్లు మరియు మినరల్స్ కలిగి ఉంటుంది. ప్రసవం తర్వాత ఎవరైతే తల్లులు ఐరన్ లోపం తో ఉంటారో వారికి పాలకూర చాలా ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాదు మీ శరీరాన్నీ శుభ్రం చేస్తుంది మరియు మీకు కావలసిన మంచి ఆరోగ్యమైన శరీరం కోసం తొక్సిఫ్యింగ్  ఏజెంట్ లను బయటకు తెస్తుంది. దీనిని మీరు సలాడ్స్ లో తినొచ్చు, లేదా కూర చేసుకుని తినొచ్చు, లేదా ఫ్రెష్ గా జ్యూస్ చేసుకుని త్రాగొచ్చు.

నల్ల నువ్వులు; నువ్వులను టిల్ అని కూడా అంటారు.ఇది విటమిన్స్ మరియు మేనేరల్స్ యొక్క ముఖ్యమైన పోషకం. అందుకనే దీనిని పాల ఉత్పత్తి పెంచడానికి అతి ముఖ్యమైన ఆహారం అంటారు. మీరు నువ్వుల నూనెతో వంటలు చేసుకోవచ్చు. దీనిని మీరు గార్నిష్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు.

సొంపు విత్తనాలు; సొంపు విత్తనాలు లేదా చోటి సౌంఫ్ ఇది వంటలు ముఖ్యమైన వస్తువు మరియు మూలికా ఔషధాలు కూడా ముఖ్యమైనది. ఇది మీ రొమ్ములలో రక్త సరఫరాని పెంచుతుంది, మరియు పాల ఉత్పత్తి ని కూడా పెంచుతుంది. మీరు దీనిని సులభంగా నమిలి తినొచ్చు లేదా పాలలో కానీ నీళ్ళలో కానీ కలుపుకుని త్రాగొచ్చు.

ఓటమేల్; ఓటమేల్ లేదా దలియ శక్తిని పెంచడానికి మంచి మూలం. దీనిలో ఫైబర్ మరియు ఆంటీఆక్సిడెంట్ లు ఎక్కువగా ఉంటాయి, అవి తల్లి ఆరోగ్యంగా ఉండటానికి మరియు అరుగుదల పెంచడానికి ఉపయోగపడుతుంది. దీనిని మన పూర్వికులు కూడా ఉపయోగించేవారు అధిక పాల ఉత్పత్తి కోసం. మీరు దేనితో పొర్రిడ్జి,  ఇడ్లీ,  పోహ, లేదా చల్ల చేసుకోవచ్చు.

బార్లీ; బార్లీ ఇది హైడ్రాషన్ గా ఉండటానికి మరియు శక్తిని పెంచుతుంది మరియు రొమ్ము పాల ఉత్పత్తిని పెంచడానికి అతి ముఖ్యమైన ఆహారం. అది మాత్రమే కాదు బార్లీ త్వరగా జీర్ణమవడానికి, రొమ్ము పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు రకరకాల అనారోగ్యాలు దరి చేరకుండా కాపాడుతుంది. మీరు దీనిని నీటిలో మరిగించి త్రాగొచ్చు, సూప్ చేసుకోవచ్చు.

చిలకడ దుంప; చిలకడ దుంప లేదా శాఖరాఖండ్ ఇది పాలిచ్చే తల్లులకు గర్భిణి స్త్రీలకు ముఖ్యమైన మినరల్స్ మరియు మేనేరల్స్ ను అందిస్తుంది. చిలకడ దుంపలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. దీనిని మీరు ఉదకపెట్టుకుని తినొచ్చు, లేదా కాల్చుకుని తినొచ్చు, లేదా సూప్ చేసుకుని తగొచ్చు.

సొరకాయ; సొరకాయ  ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటుంది మరియు ఇది రొమ్ము పాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాదు ఇది మీ శరీరాన్ని హైడ్రాటెడ్ గా ఉంచుతుంది, మరియు రొమ్ము పాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. మీరు దీనిని కూరల్లో వాడుకోవచ్చు, లేదా జ్యూస్ చేసుకుని త్రాగండి రుచి కోసం కొంచెం నిమ్మకాయ రసం కలుపుకోండి.

కాకరకాయ; కాకరకాయ లేదా కరేల ఎక్కువ ఫోలిసి ఆమ్లం కలిగి ఉంటుంది మరియు దీని పోషకాలు మీ రొమ్ము పాల ఉత్పత్తికి సహాయపడుతుంది.ఇది మాత్రమే కాకుండా తల్లులలో లివర్ ఫంక్షన్ డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుంది, శరీరం నుండి వ్యర్ధాలను బైటకి పంపి మిమ్మల్ని హైడ్రాషన్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.దీనిని సాధారణంగా డయాబెటిస్ పేషెంట్స్ వాడుతారు వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడానికి మరియు డయాబెటిక్ తల్లి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

ముగింపు;

పైన ఇవ్వబడిన ఆహారాలు కొన్ని మాత్రమే అవి మీ రొమ్ము పాల ఉత్పత్తిని పెంచుతాయి. కేవలం రొమ్ము పలు పెంచుకోవడానికి మాత్రమే కాదు మొత్తం మీ శరీరానికి కూడా చాలా ముఖ్యమైనవి.

ప్రస్థావనలు:

Being Happy Mom. (2018). 43 best foods to increase breastmilk supply quickly – Being Happy Mom. [online] Available at: https://www.beinghappymom.com/foods-increase-breast-milk-supply/ [Accessed 27 Mar. 2018].

MomJunction. (2018). 25 Best Foods To Increase Breast Milk. [online] Available at: https://www.momjunction.com/articles/best-foods-to-increse-breast-milk_0076100/#gref [Accessed 27 Mar. 2018].

Today’s Parent. (2018). 7 foods to increase breast milk production. [online] Available at: https://www.todaysparent.com/baby/breastfeeding/7-foods-to-boost-your-breastmilk/ [Accessed 27 Mar. 2018].