శిశువు ఆకలి కోల్పోవడాన్ని ఎదుర్కోవడం ఎలా

శిశువు ఆకలి కోల్పోవడాన్ని ఎదుర్కోవడం ఎలా

 

ఈ వ్యాసం ప్రస్తుతం IAP నిపుణుల సమీక్షలో ఉంది; ఇంకా సవరించలేదు మరియు ఆమోదించలేదు మరియు సాంకేతిక మరియు భాషా లోపాలను కలిగి ఉండవచ్చు. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సరిదిద్దబడిన మరియు ఆమోదించబడిన ఆంగ్ల సంస్కరణను దయచేసి చదవండి.

ఈ విస్తృత ప్రపంచం మొత్తం లో తల్లిదండ్రులకు వారి చిన్నారిని వారి చేతుల్లో ఎత్తుకోవడం కంటే సంతోషకరమైన క్షణం మరొకటి ఉండదు. తల్లిదండ్రులను మరింత ఆందోళన కలిగించే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి అవి వారి చిన్నారి సరిగా తినకపోవడం.తల్లిదండ్రులు వారి పిల్లలు ఎదిగి సంపూర్ణ అభివృద్ధి చెందేంత వరకూ  వారికి ఉత్తమమైనవి అందించడం లో ఒక మైలు ముందుంటారు. మరియు పోషకాహారం పరిపూర్ణమైన అభివృద్ధికి ప్రాధమిక పునాదిని సూచిస్తుంది.

ఆకలిని కోల్పోవడం అంటే ఏమిటి

 నిరంతరం తినడానికి తగ్గిన కోరికను ఆకలిని కోల్పోవడం అంటారు. అయితే ఇది గమనించుకోవాలి నమూనా సెట్ కలిగిన పెద్దవాళ్ళ లా కాకుండా, చిన్న పిల్లల ఆకలి కోరిక రోజు రోజుకూ మారుతుంది కొన్ని సార్లు భోజనం భోజనానికి మారుతుంది మరియు అందరూ ఒప్పుకోవాలి అది’ఒక శిశువు తనకు తానే యజమాని మరియు ఆకలి కలిగినప్పుడు మాత్రమే తింటారు’.

 చిన్నపిల్లలు తమ ఆకలిని కోల్పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా సార్లు, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడం తో పోలిస్తే తక్కువ ఆహార ప్రాధాన్యత ఉండటం ఒక ప్రయాణిస్తున్న దశ. మీ పిల్లలు చాలా తక్కువ ఆహారాన్ని తీసుకుంటుంటే ఇది ఆందోళన కలిగించే విషయం.మీ బిడ్డ కోల్పోయిన ఆకలితో బాధపడుతూ ఉంటే, అతను చిరాకును ప్రదార్శిస్తాడు, వాంతులు, దగ్గు మరియు ఇష్టమైన ఆహారాన్ని తినడానికి సంకోచిస్తాడు.

ఆకలి తగ్గడానికి గల కారణాలు

1.వృద్ధి రేటు

 మీ శిశువు యొక్క వృద్ధి రేటు  0-6 నెలల వరకూ ఎక్కువగా ఉంటుంది, అది దాని అభివృద్ధి వేగాన్ని 6-12 నెలల నుండి తగ్గించడం ప్రారంభిస్తుంది. మరియు అభివృద్ధి రేటును 12-18 నెలలలో మరింత తగ్గిస్తుంది. ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు మీ బిడ్డ14-15 నెలల వయసులో  12 నెలల వయసులో కంటే తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. అలాంటి సమయం లో తక్కువ ఆహారం ఎక్కువ సార్లు ఇవ్వడం వలన వయస్సుకు అవసరమైన పోషకాహారం అందించడానికి ప్రయత్నించండి.

2.పళ్ళు రావడం

 చాలావరకూ పిల్లలకు  8-10 నెలల వయసులో పళ్ళు రావడం మొదలవుతాయి. అసౌకర్యం మరియు నొప్పి పిల్లల ఆకలి  కోల్పోవడానికి కారణమవచ్చు. మీ పిల్లలు 5 – 7 నెలల వయసులో పళ్ళు రావడం మొదలవుతుంది . మషేడ్ ఫుడ్ ను తినడానికి బదులుగా (క్యారేట్, గుమ్మడికాయ, అరటిపండు, ధాన్యం, బియ్యం ) నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మంచిది.

3.ద్రవాలు తీసుకోవడం

 మీ బిడ్డ తక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి ఇంకొక కారణం ఎక్కువగా నీళ్లు త్రాగడం జ్యూస్ మరియు పాలు. 6 నెలల వరకు నీటిని నిలుపుకోవటానికి ఇది సిఫార్సు చేయబడింది.అతను తీసుకునే పాలు అతను హైడ్రాటెడ్ గా ఉండటానికి సరిపోతుంది. మరియు పెద్దలకు,పెద్ద మొత్తం లో ఒక గ్లాస్ పాలు సరిపోతుంది. ఒకేసారి ఎక్కువ పాలు ఇవ్వడం తగ్గించాలి దీని వలన మీ పిల్లలు వేరే ఆహారం తీసుకోవడానికి వీలుంటుంది.

4. అనారోగ్యం

  అన్నిటి కంటే  భయాంకరమైనది మీ బిడ్డకు ఇన్ఫెక్షన్ సంభవించడం.ఒక వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (ఫ్లూ, చెవి ఇన్ఫెక్షన్, గొంతులో మాన్తా, నీరు కారే ముక్కు) దీని వలన మీ బిడ్డకు నొప్పి ,అసౌకర్యం కలుగుతుంది మతియు తినే వేళల్లో కూడా అసౌకర్యం కలుగుతుంది. మీ బిడ్డ అనారోగ్యానికి సంబంధించి ఏవైనా పరివర్తన మార్పులు మీరు గమనించినట్లైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

 మీ బిడ్డ ఆకలిని తగ్గించే మరొక కారణం పురుగు సంక్రమణ. పురుగుల నిర్మూలన అనేది మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా ముఖ్యం.

 రక్త హీనత మరొక కారణం ఇది మీ పిల్లలు నీరసం గా మరియు త్వరగా అలసిపోయినట్లు కనిపిస్తుంది.  

5.ఆహారం ఇష్టపడుటలేదు

  కొత్తగా ప్రవేశ పెట్టిన ఆహారాన్ని మీ పిల్లలు ఇష్టపడటానికి కొంత సమయం పడుతుంది. సహణంగా ఉండండి, తనంతట తాను తినడానికి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించదానికి పలుమార్లు ప్రయత్నించండి. ఎక్కువగా తినిపించకపోవడం కూడా వారు తినడానికి ఉపయోగపడుతుంది.

  మరోవైపు మీ పిల్లలు రోజూ ఒకే లాంటి ఆహారాన్ని ఇష్టపడరు. వివిధ రకాల మరియు ఆకలి కలిగించే ఆహార పదార్ధాలు ప్రయత్నించండి. కొన్ని ఆహారాలు జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మీ పిల్లలు వారి కడుపు ఇంకా నిండుగా ఉందని భావిస్తారు.

నేను ఎప్పుడు ఆందోళన చెందుతాను?

  గుర్తుంచుకోండి చాలా సందర్భాలలో ఆకలిని కోల్పోవడం అనేది కేవలం ఒక ప్రయాణిస్తున్న దశ. మీ బిడ్డ వారం కంటే ఎక్కువ రోజులు ఆహారాన్ని తిరస్కరిస్తూ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీ బిడ్డ ఆకలిని కోల్పోయినప్పుడు జ్వరం, దద్దుర్లు, ప్రేగు కడలికలలో మార్పులు ఉన్నట్లయితే వెంటనే వైద్యం అవసరం. మీరు శిశువుతో ఓపికగా ఉండి తన ఇష్టాలు అయిష్టాలు ఎంటో తెలుసుకొని వాటినే తన ఆహారం లో చేర్చండి.

ఆకలిని పెంచడం ఎలా

 ఆహారం లో స్వల్ప మార్పులు చేయడం ద్వారా ఆహార అలవాట్లు మారతాయి.

 జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాలు హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ను ఉత్పత్తి చేస్తాయి, ఇవి సరైన జీర్ణక్రియకు ఉపయగపడుతుంది. ఉదాహరణకు చికెన్.

 భోజనం భోజనానికి మధ్య గ్యాప్ ఇవ్వడం వల్ల తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి తగినంత సనయం ఉంటుంది.

 ఆకలిని పెంచే ఆహారాన్ని ఇవ్వండి. వాము మరిరు తులసి మంచి ఉదాహరణలు. నీటిలో కొంచెం వాము మరియు కొన్ని తులసి ఆకులు వేసి మరిగించి వడగట్టి ఆ నీటిని త్రాగించడం ద్వారా తిన్న ఆహారం జీర్ణమవుతుంది మరియు ఆకలిని పెంచుతుంది. 18 నెలల వయసున్న పిల్లలకు వారి ఆహారం లో కొంచెం వామును చేర్చండి.

 అంతేకాక పిల్లల ఆహారం లో ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలను చేర్చడానికి నిరంతరం కృషి  చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన అలవాట్లు సుదీర్ఘ మార్గం లోకి వస్తాయి.