పెరుగుతున్న పిల్లల్లో విటమిన్ లోపాలు మరియు పరిష్కరించడం ఎలా

 

ఈ వ్యాసం ప్రస్తుతం IAP నిపుణుల సమీక్షలో ఉంది; ఇంకా సవరించలేదు మరియు ఆమోదించలేదు మరియు సాంకేతిక మరియు భాషా లోపాలను కలిగి ఉండవచ్చు. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సరిదిద్దబడిన మరియు ఆమోదించబడిన ఆంగ్ల సంస్కరణను దయచేసి చదవండి.

తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయం లో ఆందోళన చెందుతారు మరియు వారి పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ఉత్తమ ప్రయత్నం చేస్తారు.తగిన అవగాహన లేకపోవడం వలన తినడానికి మారం చేసే పిల్లలకు ఆహారాన్ని అందించడం అనేది తల్లిదండ్రులకు సవాలు లాంటిది.పిల్లల పెరుగుదల మరియు ఎదుగుదల పెదవాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది.అయినప్పటికీ వారికి అవసరమైన పోషకాలు అందించడం అత్యవసరం.ముఖ్యమైన పోషకాలలో ఒకటి విటమిన్స్.

విటమిన్లు అంటే ఏమిటి?

విటమిన్లు అంటే ఒక సమూహ పోషకాలు అవి మన శరీరానికి అవసరమైన పెరుగుదల మరియు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.అవి మన శరీరం లోని జీర్ణాశయాన్ని మెరుగుపరచడానికి మరియు నిరోధక శక్తిని పెంచడానికి అవసరం .13 రకాల విటమిన్లు ఉన్నాయి- అవి రెండు భాగాలుగా విభజించబడ్డాయి- కొవ్వులో కరిగేవి(కొవ్వులో కరిగించు) మరియు నీళ్లలో కరిగేవి(నీటిలో కరిగించు). ఈ వర్గీకరణ మనం తీసుకున్న ఆహారం నుండి మన శరీరం ఎంత పోషణను తీసుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

 • కొవ్వులో కరిగే విటమిన్లు

ఇవి A,D,E మరియు K అనే విటమిన్లు కలిగి ఉంటాయి.అవి ఆహారంలో కొవ్వు ను గ్రహించి శరీరంలో నిల్వ చేస్తాయి.(కాలేయం, కొవ్వు,మరియు కండరాల కణజాలం)

నీళ్లలో కరిగే కణజాలం

ఇవి C మరియు ఎనిమిదవ B విటమిన్లు కలిగి ఉంటాయి.సారూప్యత కలిగి ఉన్న విటమిన్ల సమూహం వలన మన శరీరం లోని క్లిష్టమైన పనులకు ప్రత్యేకమైనవి.నీళ్లలో కరిగిపోయే విటమిన్లు నీటిలో కలిసిపోయి నేరుగా రక్త ప్రవాహం లోకి ప్రవేశించుతాయి.ఇవి శరీరం లో నిల్వ ఉండవు.అందుచేత క్రమంగా భర్తీ చేయాలి.

ఈ పదమూడు విటమిన్లలో ప్రతి ఒక్కటీ ప్రత్యేక విధులను అందిస్తుంది, కానీ అవి మంచి ఆరోగ్యాన్ని సులభతరం చేయడానికి కలిసి పని చేస్తాయి. పిల్లల శరీరం లోని విటమిన్ లోపలు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

లోపాలెందుకు మంచిది కాదు?

మన శరీరం అందించిన లేదా ఆహారం నుండి అవసరమైన మొత్తం పోషకాలను గ్రహించడం సాధ్యం కానప్పుడు,పోషకాల లోపాలకు దారితీస్తుంది. ఒక విటమిన్ లోపం వలన శరీరం లో ముఖ్యమైన విటమిన్లు తక్కువగా ఉంటాయి ఇది మీ శరీరాన్ని అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈ క్రింది పట్టికలో శరీరానికి ప్రతి విటమిన్  లేకపోవడం వలన ఎదురయ్యే సమస్యలేమిటో తెలియజేయబడింది.

విటమిన్లు మానవ శరీరం కోసం అవసరమైనవి లోపం కారణం గా సమస్యలు
విటమిన్ A ఆరోగ్యకరమైన దృష్టి మరియు చర్మం, పంటి మరియు ఎముక నిర్మాణం, కణాల పునరుత్పత్తు, రోగ నిరోధక వ్యవస్థ బలహీన దృష్టి,(రే చీకటి) క్షీణించిన రోగనిరోధక వ్యస్థ,పొడి చర్మం
విటమిన్ B1

థియామైన్

శక్తి కోసం కార్బోహైడ్రేట్ల జీవక్రియ, ఎలెక్టరోలైట్ సంతులనం, నాడీ వ్యవస్థ ఫంక్షన్ బెరీ బెరీ
విటమిన్ B2

రిబోఫ్లవిన్

శక్తి ఉత్పత్తి, ఎర్ర రక్త కణాలు ఏర్పడటం అరిబోఫ్లావినోసిస్
విటమిన్ B3

నియాసిన్

జీవ క్రియ, ఏంజైమ్ మరియు నాడీ ఫంక్షన్, ఆరోగ్యకరమైన చర్మం పెల్లాగ్రా
విటమిన్ B5

పంటోతనిక్ ఆసిడ్

జీవక్రియ, హార్మోన్లు మరియు ఎర్ర రక్త కణాలు ఏర్పడటం పరస్తేసియా
విటమిన్ B6

పీరోధోక్సిన్

ఎర్ర రక్త కణాలు ఏర్పడటం,మెదడు ఫంక్షన్, రోగ నిరోధక వ్యవస్థ కన్వల్షన్స్, ఎనీమియా
విటమిన్ B7

బయోటిన్

జీవ క్రియల వాస్తవాలు,ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్లు,ఆరోగ్యకరమైన చర్మం మరియ జుట్టు చర్మం దద్దుర్లు, జుట్టూడుట
విటమిన్ B9

ఫోలేట్

ఎర్ర రక్త కణాలు ఏర్పడటం, కొత్త కణాల అభివృద్ధి, ప్రోటీన్ జీవక్రియ మెగాలోబ్లాస్టిక్ అనిమియా
విటమిన్ B12

కోబాలమీన్

ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, నాడీ వ్యవస్థ ఫంక్షన్ మెగాలోబ్లాస్టిక్ అనిమియా
విటమిన్ C కొల్లాజెన్ తయారీ,గాయం మానుట, ఇనుము శోషన, రోగ నిరోధక వ్యస్థ స్కార్విస్
విటమిన్ D ఆరోగ్యకరమైన ఎముకలు,కాల్షియమ్ శోషన రికెట్స్
విటమిన్ E ఆంటీఆక్సిడెంట్,రోగ నిరోధక వ్యస్థ క్షీణించిన రోగ నిరోధక వ్యస్థ
విటమిన్ K రక్తము గడ్డ కట్టుట, ఆరోగ్యకరమైన ఎముకలు ర్రక్తంగడ్డ కట్టడం లో సమస్యలు

విటమిన్ లోపాలను కనుగొనే పద్ధతులు

పిల్లల్లో విటమిన్ లోపాలను కనుగొనేందుకు వారి లక్షణాలను గమనించాలి మరియు రక్త పరీక్షలు చేయించడం ద్వారా తెల్సుకోవచ్చు.

 • లక్షణాలు

వివిధ రకాల విటమిన్ లోపల లక్షణాలు ఉన్నాయి, వీటిపై సరైన అవగాహన లేకపోవడం తో నిర్లక్ష్యం చేయబడతాయి. సాధారణ లక్షణాలు కొన్ని అలసట,బద్ధకం,ఏకాగ్రత లేకపోవడం. క్రింద ప్రతి ఒక్క విటమిన్ లోపాల లక్షణాలు ఇవ్వబడ్డాయి:

 1. విటమిన్ A – తక్కువ వెలుతురు ఉన్నప్పుడు క్షీణించిన దృష్టి లేదా తక్కువ దృష్టి, పొడి బారిన చర్మం,జుట్టు, మరియు కళ్ళు, తరచుగా అంటు వ్యాధులు మరియు కంటి వాపు.
 2. విటమిన్ B1 – ఆకాలేయకపోవడం, కండరాల బలహీనత, మరియు అలసట.
 3. విటమిన్ B2 – నోటి చుట్టు మూలలో పగలడం, పొడిబారిన గొంతు మరియు నాలుక.
 4. విటమిన్ B3 – అతిసారం,చర్మ వ్యాధులు, బద్ధకం.
 5. విటమిన్ B5 – చేతులు మరియు అరి కాళ్ళల్లో మంటలు, వాంతులు అయ్యేలా అనిపించడం, నిద్ర సమస్యలు.
 6. విటమిన్ B6 – చర్మ వాపు,కండరాల బలహీనత, ఏకాగ్రత లోపం, మూర్ఛ సమస్యలు.
 7. విటమిన్ B7 – చర్మ వ్యాధులు, జుట్టూడుట, వాసనలు పడకపోవడం, కండరాల నొప్పులు, రక్త హీనత.
 8. విటమిన్ B9 – ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఎదుగుదల తగ్గడం.
 9. విటమిన్ B12 – ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఎదుగుదల లోపం, శ్వాశ తక్కువగా తీసుకోవడం, తల తిరగడం.
 10. విటమిన్ C – రక్తస్రావం  మరియు చిగుళ్ల వాపు, జాయింట్లు మరియు కండరాల నొప్పి, తేలికగా గాయలవడం, గాయాలు నాయమవ్వకపోవడం, పొడి బారిన చర్మం, అంటు వ్యాధులు.
 11. విటమిన్ D – ఎముకలు సున్నితంగా లేదా నొప్పిగా ఉండటం, ఎదుగుదల లోపం, కండరాల తిమ్మిరి, పళ్ళు మరియు ఆస్తి పంజర వైకల్యాలు.
 12. విటమిన్ E – కండరాల బలహీనత లేదా నొప్పి, సమన్వయ సమస్యలు, దృశ్య ఆటంకాలు.
 13. విటమిన్ K – ఎక్కువ రక్తస్రావం, సులభంగా గాయాలు, రక్త హీనత.

ఇది ముఖ్యంగా మనసు భరించాలి ఎందుకంటే అన్ని లక్షణాలను గుర్తించలేరు. మీ పిల్లల వైద్యుడిని కలిసి మీ పిల్లలకు ఎటువంటి ఆహారపుఅలవాట్లు చేయాలో తెలుసుకోవడం ఉత్తమమైన పని. ఏవైనా లక్షణాలు ప్రబలంగా ఉన్నట్లయితే అది లోపం యొక్క సూచన. దీన్ని అంతనా వేసి రక్త పరీక్ష చేయడం ద్వారా నిర్ధారించుకోవాలి.

 • రక్త పరీక్షలు

రక్త పరీక్ష విటమిన్ లెవల్స్ ను గుర్తించి సరైన వైద్యం తీసుకోవడానికి సహాయపడుతుంది. రక్త పరీక్ష, రక్తం లో మొత్తం విటమిన్ లోపాలను తెలియచేస్తుంది. ఆరోగ్యకరమైన స్థాయిలను నిర్వహించే సూచన పరిధిలో ఆ విటమిన్ యొక్క వ్యక్తిగత స్థాయిని సరిపోలుస్తుంది. క్రింద ఆరోగ్యకరమైన పరిధి మరియు పడిపోతున్న స్థాయిల లోపాల  యొక్క సూచన ఇవ్వబడింది.

లోపాలను పరిష్కరించడానికి మార్గాలు

విటమిన్ లోపాలను పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన మార్గం మీ పిల్లల ఆహారం లో కావాల్సిన విటమిన్లు అందించండి. వాటి మూలాలు తెలిసిన తర్వాత ఇది సాధ్యపడుతుంది.

 • విటమిన్ A నారింజ రంగులో ఉండే పండ్లు,కూరగాయల్లో దొరుకుతుంది. అవి క్యారెట్,గుమ్మడికాయ,చిలకడ దుంప,ఆకు కూరల్లో పాలకూర,లివర్,పాలు,గుడ్లు,మరియు చేపలు.
 • విటమిన్ B1 లివర్,కిడ్నీ గింజలు(పొద్దు తిరుగుడు గింజలు,నువ్వులు) బఠాణీలు,పుట్టగొడుగులు,మరియు పిస్తా పప్పు లలో దొరుకుతుంది.
 • విటమిన్ B2 డైరీ ఉత్పత్తుల్లో(పాలు,పెరుగు,చీజ్) మరియు లివర్,మాంసం,గుడ్లు,బాదం,పాలకూర లలో దొరుకుతుంది.
 • విటమిన్ B3 బ్రోకలి,టర్కీ,చికెన్ బ్రేస్ట్,టున,పుట్టగొడుగులు,బఠాణీలు,పల్లీలు,మరియు పొద్దుతిరుగుడు గింజలలో దొరుకుతుంది.
 • విటమిన్ B5 మాంసం,పౌల్ట్రీ(చికెన్,లివర్) సాల్మన్,ఎండబెట్టిన టమాటాలు,పుట్టగొడుగులు,కాలిఫ్లవర్,మరియు అవకాడో లలో దొరుకుతుంది.
 • విటమిన్ B6 సొయా ఉత్పత్తులు, పిస్తా పప్పులు,నువ్వులు మరియు పొద్దుతిరుగుడు గింజలలో దొరుకుతుంది.
 • విటమిన్ B7 లివర్,గుడ్లు,ఈస్ట్,అవకాడో, క్యాబేజీ, సొయా గింజలు,మరియు బాదం పప్పులలో దొరుకుతుంది.
 • విటమిన్ B9 ఆకుపచ్చని కూరగాయలు పాలకూర, బ్రోకలి,చిక్కుడుకాయలు,పచ్చి బఠాణీలు,అరటిపండు,మరియు నారింజ పండులలో దొరుకుతుంది.
 • విటమిన్ B12 చేపలు,పౌల్ట్రీ,మాంసం,గుడ్లు,పాలు,పన్నీర్ లలో దొరుకుతుంది.
 • విటమిన్ C పుల్లటి పండ్లలో దొరుకుతుంది అవి నిమ్మకాయలు,నారింజపండ్లు,మరియు తియ్యని నిమ్మ,క్యాప్సికమ్, జమకాయ,బొప్పాయి,మరియు కాలిఫ్లవర్.
 • విటమిన్ D ఎండలో ఉండటం వలన మానవ శరీరానికి తగినంత D విటమిన్ లభిస్తుంది.మరియు ఇది గుడ్లు,పాలు,పుట్టగొడుగులు,మరియు కొవ్వు లేని చేపలు(సాల్మన్,టున) వంటి వాటిలో కూడా దొరుకుతుంది.
 • విటమిన్ E ఆకురాల్లో పాలకూర,నట్స్ లో పల్లీలు,పొద్దుతిరుగుడు గింజలు,బాదం,ష్రిమ్ప్,మరియు అవకాడో ల లో దొరుకుతుంది.
 • విటమిన్ K పచ్చని ఆవాలు,పార్స్లీ, లెట్టస్,బ్రోకోలి,మైయు కాలిఫ్లవర్ లలో దొరుకుతుంది.

విటమిన్లు పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు మరియు వాటి పనులను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. వారి లోపాల వలన సంభవించిన సమస్యలు మరియు మీ పిల్లలకు మంచి ఆహారాన్ని ప్లాన్ చేయడం లో మీకు సహాయపడుతుంది.లోపాలను సకాలం లో గుర్తించి మరియు వైద్యుడి సలహా తీసుకుని మరింత ఆరోగ్య సమస్యలు నిరోధించడానికి సహాయపడుతుంది. ఫాస్ట్ ఫుడ్ ప్రపంచం లో పిల్లలు ఫాస్ట్ ఫుడ్ ను ఇష్టపడుతున్నారు. వారికి ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం ఇవ్వడం అనేది ఒక సవాలు కావచ్చు,కానీ అది అసాధ్యమైనది కాదు.